ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గొల్లపల్లికి చెందిన బార్గవ్ కుమార్ రెడ్డి ప్రతిభ చాటాడు. చదువు పూర్తికాకముందే సంవత్సరానికి రూ.1.70 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్న భార్గవ్…డిసెంబర్ లో కోర్సు పూర్తి చేసుకుంటాడు. అతడి ప్రతిభను గుర్తించిన క్వాల్ కాం సంస్థ…ముందుగానే కొలువు ఇచ్చింది. అధునాతన చిప్ తయారీపై భార్గవ్ పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగం రావటం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.