అసోంలో అరుదైన టీ రకం ‘ప్రభోజన్ గోల్డ్ టీ’కి భారీ ధర లభించింది. సోమవారం జోర్హాట్‌లో జరిగిన వేలంపాటలో ఏకంగా కిలో రూ.లక్షకు అమ్ముడుపోయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా స్థానిక వ్యాపారులు చెప్పారు. అసోం గోలఘాట్ జిల్లాలో ఈ అరుదైన తేయాకు రకాన్ని పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తారు. ప్రభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ నుంచి ‘ఎసా టీ’ దీన్ని కొనుగోలు చేసింది. ప్రత్యేక రుచి కలిగిన ఈ టీని ఇష్టపడేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని సంస్థ తెలిపింది.