తెలంగాణ హైకోర్టుకు 10 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి మంగళవారం ఆమోదముద్ర వేశారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మనేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, నచ్చరాజు శ్రవణ్ కుమార్ వెంకట్, గున్ను అనుపమ చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్ రెడ్డి, దేవరాజు నాగార్జున. వీరు గురువారం(మార్చి 24న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం 19 మంది న్యాయమూర్తులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య మొత్తం 29కి చేరింది.