10 తులాల బంగారాన్నిపోలీసులకు ఎలుక పట్టించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే ముంబైలోని దిండోషిలో ఓ మహిళ 10 తులాల గోల్డ్ తనాఖా పెట్టేందుకు బ్యాంకుకు వెళ్లింది. ఆ క్రమంలో మధ్యలో ఓ యాచకురాలు అడుగగా ఆమెకు వడాపావ్ ఉన్న సంచికి బదులు పొరపాటున బంగారం ఉన్న సంచి ఇచ్చింది. తీరా బ్యాంకుకు వెళ్లాకా తెలుసుకుని తిరిగి వచ్చి చుడగా ఆమె కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు యాచకురాలి జాడను సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. యాచకురాలిని సంచి గురించి అడుగగా వడాపావ్ పొడిగా ఉందని చెత్తలో పడేసినట్లు తెలిపింది. ఇక చెత్త దగ్గర ఉన్న సీసీ కెమెరాను పోలీసులు పరిశీలించగా ఆ సంచిని ఓ ఎలుక లాక్కెళ్లినట్లు గుర్తించారు. తర్వాత ఎలుకను వెంబడించగా నగల ఆచూకీ లభ్యమైంది.