గోదావరి ఉద్ధృతితో తీవ్రంగా నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి రూ.10 వేలు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. వారికి ఇవాళే సాయం అందనుంది. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓ ప్రకటన చేశారు. వీటితో పాటు ఒక్కో ఇంటికి 20 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు 2 నెలలపాటు ఉచితంగా ఇస్తామని తెలిపారు.