రాష్ట్రంలో ఆరో విడత జగనన్న తోడును సీఎం జగన్ ఇటీవల ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ నెల 18 నుంచి 21వరకు మండల, మున్సిపాలిటీ స్థాయుల్లో లబ్ధిదారులతో బ్యాంకర్ల సమావేశాలు జరగనున్నాయి. ఆరో విడతలో 4.90లక్షలకు పైగా అర్హులకు రుణాలు మంజూరు కానున్నాయి. తొలుత గ్రామీణ, మున్సిపాలిటీ స్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసి.. 25న జిల్లా స్థాయుల్లో డీసీసీల సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. వీధి వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా రూ.10వేల రుణం ప్రభుత్వం కల్పిస్తోంది. సకాలంలో రుణం చెల్లించిన వారికి రుణ పరిమితిని పెంచుతోంది.