లిక్కర్ స్కాంలో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని టీబీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఈ స్కాంలో కవిత పాత్ర త్వరలోనే తెలుస్తుందన్నారు. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత ప్రజలకు సమాధానం చెప్పి తీరాలన్నారు.కేసీఆర్, సోనియా ఎవరైనా దర్యాప్తు సంస్థలకు ఒక్కటేనని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్ చేరుకున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.