దేశంలో కొత్తగా 1,007 కోవిడ్ కేసులు నమోదు

© File Photo

దేశంలో గత 24 గంటల్లో 1,007 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,39,025కి చేరుకుంది. మరో 26 మంది కరోనా కారణంగా మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,21,736 కు పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 11,058కి తగ్గింది. ఈ క్రమంలో యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా, COVID-19 రికవరీ రేటు 98.76 శాతంకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు ప్రకటించింది. మరోవైపు నోయిడా పొరుగున ఉన్న ఢిల్లీలోని 4 స్కూళ్లలో గత 3 రోజుల్లో 23 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.

Exit mobile version