మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరగనున్న 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల ప్రాధాన్యం అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM)లో మహిళల ప్రాధాన్యం గురించి ప్రస్తావించడంతో పాటు…ఇందులో వారి ప్రాధాన్యం పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 2020లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. తర్వాత కరోనా కారణంగా వాయిదా పడింది.