– తెలంగాణలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించిన కేటీఆర్
– ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఇస్రో. ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులకు అవకాశం
– నేడు యాదాద్రికి వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్. తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొననున్న కేసీఆర్ దంపతులు
– ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేసిన ఇంటర్ బోర్డు. వారం రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించిన బోర్డు
– నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న వైఎస్.షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర
– ఇస్తాంబుల్‌లో జరిగే మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు ఎన్నికైన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్
– ఇవాళ, రేపు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ