మహిళా సర్పంచిపై 11 మంది లైంగిక దాడికి యత్నించిన దారుణ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. పూసపాటిరేగ మండలంలో, రేకుల షెడ్డులో ఉండగా..11 మంది వచ్చి తనపై లైంగిక దాడికి యత్నించారని మహిళ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని తెలిపారు. గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చారని, దాంతో వారు పారిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు.