ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై చర్చకు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు తెదేపా సభ్యులు. సభకు ఆటంకం కలిగిస్తుండటంతో ఒకేరోజు 11 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. ఒక్క రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.