కరోనా మహమ్మారి పీడ తొలగట్లేదు. ఒకదాని వెనక మరో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల చైనాలో ఒమిక్రాన్ BF.7 వేరియంట్ కల్లోలం సృష్టించగా భారత్ అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికులు ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహిస్తూ కట్టడికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విమానాశ్రయాలు, ఓడరేవుల్లో డిసెంబర్ 24 నంచి జనవరి 3 మధ్య నిర్వహించిన టెస్టుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ గతంలో నమోదైన ఒమిక్రాన్ వేరియంట్లేనని పేర్కొన్నారు.