వివిధ ప్రమాదాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 12వేల మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీరిలో 5-29 ఏళ్ల మధ్యనున్న వారే అధికమని తెలిపింది. వివిధ కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 44 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రమాదాల వల్ల మరణిస్తే; ప్రతి ఆరు మరణాల్లో ఒకటి ఆత్మహత్య కేసు. ప్రతి తొమ్మిది మందిలో ఒకరు హత్య వల్ల మృతి చెందారు. కట్టడి చర్యలు, అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ సంఖ్యను తగ్గించవచ్చు’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ ఓ కార్యక్రమంలో తెలిపారు.