ఉత్తర భారతంలో పొగమంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 2 రైళ్లు రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు నార్తర్న్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లలో హైదరాబాద్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-న్యూ దిల్లీ రైళ్లు కూడా ఉన్నాయి. ప్రయాణికులు ఈ మేరకు తమ ప్రణాళికలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.