స్కాట్లాండ్లో వైద్య వృత్తి చేస్తున్న భారత సంతతికి చెందిన కృష్ణ సింగ్(72) అనే వ్యక్తికి ఆ దేశంలో 12 సంవత్సరాల జైలు శిక్ష పడింది. తన వద్ద వైద్యం కొరకు వచ్చిన 47 మంది మహిళలపై 35 ఏళ్లుగా కృష్ణ సింగ్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని, వారిని లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో అతనికి 12 ఏళ్ల జైలు శిక్షను విధిస్తు అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాగా స్కాట్లాండ్లో వైద్యునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగ్కు రాయల్ MBE గౌరవం కూడా లభించింది.