హరియాణాలోని జిలేబీ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాంత్రిక పూజల పేరిట మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడేవాడని గుర్తించారు. ఆ వీడియోలతో వారిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజేవాడని పోలీసుల విచారణలో గుర్తించారు. ఆత్మలు ఆవహిస్తాయని, కష్టాలు తొలిగిపోతాయని మాయమాటలు చెబుతూ మోసాలకు పాల్పడేవాడని తెలిసింది. పంజాబ్‌కు చెందిన జిలేబీ బాబా అసలు పేరు అమర్‌వీర్. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హరియాణాలోని తొహనాకు వచ్చాడు. ఇక్కడ తాంత్రిక విద్యలు తెలుసంటూ దుకాణం తెరిచి.. మోసాలు చేస్తున్నాడు.