వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహావిష్కరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహాన్ని ప్రారంభించాలని భావించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు విగ్రహాన్ని పరిశీలించారు. కాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రామ్ సుతారా తయారు చేశారు.