2023లో టెక్ రంగంలోని కొన్ని సంస్థలు బ్యాడ్ న్యూస్ ఇస్తే మరికొన్ని సంస్థలు గుడ్న్యూస్ అందిస్తున్నాయి. అమెజాన్ వంటి కంపెనీలు 25వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా..TCS మాత్రం తాము 1.25లక్షల మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నామని ప్రకటించింది. ‘కొంతకాలంగా మేం ఒకేరకంగా రిక్రూట్మెంట్లు కొనసాగిస్తున్నాం. ఏటా 1.25-1.5లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అదే కొనసాగుతుంది’ అని TCS మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గోపినాథన్ తెలిపారు.