• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 129 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బెంగాల్

    ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డు 129 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ-2022 క్వార్టర్ ఫైనల్లో బద్దలైంది. 1893లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఆస్ట్రేలియా టూరిస్ట్ మ్యాచ్లో.. ఆస్ట్రేలియా టూరిస్ట్ జట్టులోని 8 మంది ఆటగాళ్లు అర్ధశతకాలు సాధించారు. అయితే రంజీ ట్రోఫీ క్వార్టర్ పైనల్లో జార్ఖండ్ ,బెంగాల్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టులోని 9 మంది ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు సాధించారు. ఒక ఇన్నింగ్స్‌లో 9 మంది ఆటగాళ్లు అర్ధశతకాలు బాదడం చరిత్రలో ఇదే తొలిసారి. కాగా 9వ స్థానంలో ఆడిన ఆకాష్ దీప్ కేవలం 18 బంతుల్లోనే ఈ మార్కును చేరుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో బెంగాల్ 773/7 పరుగుల భారీ స్కోరు సాధించింది.