పంజాబ్ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చింది. అయితే తొలిసారిగా పంజాబ్లో 13 మంది డాక్టర్లు శాసనసభ్యులుగా ఎన్నికవడం విశేషం. దీంతో భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించబడింది అని ఆప్ సీనియర్ లీడర్ సత్యేందర్ జైన్ ట్వీట్ చేశారు. పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైన వైద్యుల జాబితాను కూడా పోస్ట్ చేశాడు.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా ఈ ఘనత సాధించినందుకు ఆప్, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ను అభినందించారు. కంటి శస్త్రవైద్యుడు డాక్టర్ చరణ్జిత్ సింగ్ చమ్కౌర్ సాహిబ్ నుంచి 7,942 ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని ఓడించారు. చన్నీ రాష్ట్ర అసెంబ్లీకి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించాడు.