తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 1.30 లక్షల కుటుంబాలకు రెండో విడత దళితబంధు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే దళితబంధు వేడుకలు కూడా నిర్వహించాలని భావించింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ విగ్రహం ప్రారంభించాలని పేర్కొంది. రాష్ట్రంలోని 4 లక్షల ఎకరాల పోడు భూములను 1,55,393 మందికి పంపిణీ చేయాలని నిర్ణయించింది.