మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోని 1433 ఖాళీల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. పురపాలకశాఖ , పబ్లిక్ హెల్త్, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీ రాజ్ శాఖల్లో పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేశారు. ఇప్పుడు పంచాయతీ శాఖలో పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.