రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచులో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 150 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (93) చేసినా కానీ మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో సీఎస్కే కేవలం 150 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మెకాయ్, చహల్ చెరి 2, అశ్విన్, బౌల్ట్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచు ఓడినా గెలిచినా చెన్నైకి పెద్దగా ఎఫెక్ట్ లేదు. చెన్నై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.