నెల్లూరు జిల్లాకు చెందిన తేజ అనే ఒక యువకుడు 1500 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర ప్రారంభించాడు. నిన్నటితో ప్రారంభమైన ఈ మారథాన్‌లో కిలోమీటర్‌కు ఒక మొక్క నాటుతూ వెళ్తానని చెప్తున్నాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన సూర్యప్రకాశ్ ప్రారంభించిన అడ్వెంచర్ అకాడమీకి చెందినవాడు ఈ తేజ. సూర్యప్రకాశ్ స్పూర్తితో ఈ అడ్వెంచర్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మారథాన్‌లో కిలోమీటర్‌కు ఒక మొక్క నాటుతూ ప్రజలకు సందేశమివ్వాలని భావిస్తున్నాడు.