అంటార్కిటికాలోని ఓ భారీ మంచు కొండ సుమారు 1550 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర విరిగిపోయింది. ఇది ముంబయి నగరానికి దాదాపు రెండింతలు. జనవరి 23న అర్ధరాత్రి ఘటన జరిగిందని బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే వెల్లడించింది. ఛాస్మ్ 1 అని పిలువబడే ఐస్ షెల్ఫ్ విస్తరణ కారణంగా విరిగిపోయిందని భావిస్తున్నారు. గత రెండేళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని వెల్లడించారు. దీని పరిణామాలకు సంబంధిం విశ్తేషిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.