AP: ఆగస్టు నెలలలో ఆహార భద్రత కార్డులు కలిగిన లబ్ధిదారులకు 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. కరోనా టైం నుంచి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్రం పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కోటాను లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీంతో మే నెల కోటాను ఆగస్టులో లబ్ధిదారులకు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ ఉచిత బియ్యం పంపిణీ ఈఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగిస్తామని కేంద్రం గతంలో వెల్లడించింది.
ఆ కార్డు ఉన్నవారికి వచ్చే నెలలో 15కేజీల బియ్యం

© ANI Photo