16-04-2022 నేటి ప్రధాన అంశాలు @8.45AM

© File Photo

– తెలంగాణలో నిన్నటితో ముగిసిన పెండింగ్ చలాన్ల ఆఫర్. ప్రభుత్వ ఖజానాకు రూ. 302 కోట్లు జమయినట్లు వెల్లడించిన పోలీస్ శాఖ
– తెలంగాణలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు అందించే ఉచిత శిక్షణకు నేటితో ముగియనున్న దరఖాస్తులు
– ఏపీలో నేటి నుంచి సచివాలయ ఉద్యోగస్తులకు రోజులో మూడు సార్లు హాజరు
– దేశవ్యాప్తంగా నేటి నుంచి లక్ష కేంద్రాల్లో టెలీ కన్సల్టేషన్ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
– చైనాలో కోరలు చాస్తోన్న కరోనా రక్కసి. దేశంలో లాక్‌డౌన్‌లోకి 40 కోట్ల మంది
– 1853లో ఇదే రోజున ఇండియాలో బొంబాయి-థానే మధ్య మొదటి ప్యాసింజర్ రైలు పరుగులు పెట్టింది
– నేడు మన భాగ్యనగరంలో హనుమాన్ జయంతి విజయయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
– నేడు ఐపీఎల్‌లో రెండు మ్యాచులు.

Exit mobile version