క్రికెట్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఆస్ట్రేలియా దేశవాలీ టోర్నీ అయిన బిగ్ బాష్ లీగ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక బంతికి 16 పరుగులు వచ్చాయి. హోబర్ట్ హరికేన్స్‌తో మ్యాచులో సిడ్నీ సిక్సర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మూడో బంతిని హరికేన్స్ బౌలర్ నోబాల్ వేయగా.. స్మిత్ సిక్సర్‌గా మలిచాడు. అనంతరం కీపర్‌కి దూరంగా వైడ్ వేయడంతో బౌండరీ వెళ్లింది. ఫ్రీ హిట్ బంతిని మళ్లీ స్మిత్ బౌండరీ బాదాడు. దీంతో 7+5+4= 16 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచులో స్మిత్ వీరవిహారం చేశాడు. 33 బంతుల్లోనే 66 పరుగులు పూర్తి చేశాడు.