బెంగళూరు రైల్వే డివిజన్‌లోని హిందూపూర్-పెనుకొండ మధ్య చేపట్టనున్న డబ్లింగ్ పనుల కారణంగా 16 రైళ్లు రద్దయ్యాయి. మంగళవారం (మార్చి 22) నుంచి మార్చి 29 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 6 రైళ్లు పాక్షికంగా రద్దు, 14 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ స్టేటస్‌ను సూచిస్తూ SMSలు పంపినట్లు తెలిపారు. పూర్తిగా రద్దు చేయబడిన రైళ్లలో బెంగళూరు కంటోన్మెంట్-ధర్మవరం MEMU, దాని రిటర్న్ రైలు, సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, దాని తిరుగు రైలు, KSR బెంగళూరు, CST (ముంబయి) మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.