పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రూ.111.62 కోట్ల వ్యయంతో 165 పశువుల అంబులెన్సులు ప్రారంభించింది. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ వాటిని జెండా ఊపి ప్రారంభించారు. 155251 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి అంబులెన్సు సేవలు ఉపయోగించుకోవచ్చు. ప్రతి అంబులెన్సులో 81 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. 54 రకాల పరికరాలు ఉంటాయి.