దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ధోరణులు, అమెరికా ఫెడ్ పాలసీ వడ్డీ రేట్ల పెంపు సహా పలు అంశాల కారణంగా మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,040 పాయింట్లు వృద్ధి చెంది 56,817 వద్ద స్థిర పడగా, నిఫ్టీ 312 పాయింట్లు పెరిగి 16,975 వద్ద ముగిసింది. దేశంలో మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో ఇండిగో షేర్లు 5% వృద్ది చెందాయి. మరోవైపు Paytm 7%, Nykaa 5% పెరిగాయి.