దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు నమోదు

© File Photo

దేశంలో గత 24 గంటల్లో 17,135 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 3 వేలకుపైగా కరోనా కేసులు పెరిగాయి. దీంతో యాక్టివ్ కేసులు 1,37,057కు చేరాయి. మరో 47 మంది మృతి చెందగా, మరణాల సంఖ్య 5,26,477కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు దాదాపు 98.49 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.32 శాతం ఉన్నాయని తెలిపింది.

Exit mobile version