తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 18గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠకాంప్లెక్సులోని 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 78,460 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 29,182 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చింది. టోకెన్ లేని భక్తులు దర్శనానికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.