ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సుమారు 18 వేల మందిని విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని సమాచారం. గత కొన్ని నెలలుగా ఉద్యోగాల్లో భారీగా కోత విధిస్తారని ప్రచారం జరిగింది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో వ్యయం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని యాజమాన్యం కూడా ప్రకటించింది. 10 వేలమందికి ఉద్వాసన పలుకుతారని భావించారు. కానీ రెట్టింపు సంఖ్యలో తొలగించారు.