యూఎస్‌లో RRR ప్రీమియర్స్ ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే రిలీజ్‌కు ముందే అక్కడ 2.5 మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగింది. భారత సినీ పరిశ్రమ చరిత్రలోనే రిలీజ్‌కు ముందు ఇంత మేర బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. విదేశాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. దీంతో ఈ సినిమా కోసం విదేశాల్లో ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఇండియాలో సినిమా రేపు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.