వాయు కాలుష్య ప్రభావంతో థాయిలాండ్‌లో సుమారు 2 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. వాయు కాలుష్యంతో బ్యాంకాక్‌లో ఒక్కసారిగా గాలి నాణ్యత పడిపోయింది. దీంతో అకస్మాత్తుగా స్థానిక ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై థాయిలాండ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేప్టటింది. చిన్నారులు, గర్భిణులు బయటకు రావద్దని సూచిస్తోంది. ఎన్95 మాస్కులు ధరించాలని పేర్కొంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది.