దేశానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పాలసీని సరళీకృతం చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) అనుమతించింది. ఈ మేరకు రాబోయే LIC IPOలో ఆటోమేటిక్ మార్గం ద్వారా 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది అతి పెద్ద FDI ప్రవాహాలకు దారి తీస్తుందని, తద్వారా పెట్టుబడి, ఆదాయం, ఉపాధి వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికకు మద్దతు ఇవ్వడానికి ఎఫ్డీఐ అనుమతించబడిందని వెల్లడించింది.