ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్న వేళ అమెజాన్ భారీగా ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. ఆ సంఖ్య దాదాపు 10 వేలు ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అంతకన్నా రెట్టింపు కోతలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 20 వేల మందిని తొలగిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పనితీరు సరిగా లేని సిబ్బందిని గుర్తించాలని మేనేజర్లకు సూచనలు అందాయని సమాచారం. కరోనా వేళ ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగులను నియమించుకున్న సంస్థ…భారం తగ్గించుకోవాలని చూస్తోంది.