జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ కేసులో నిందితులను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని పట్టుకున్న పోలీసులు నిన్న మీడియా ముందు వారి వివరాలను వెల్లడించారు. అయితే ఈ కేసులో ఆరో వ్యక్తి రేప్ చేయలేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయన్న ఆయన.. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని తెలిపారు.