హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సుమారు 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు పుష్ప సినిమా తరహాలో సరకు రవాణా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు.