‘మేజర్’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణ్ జీవితాన్ని తెరపై చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విదేశాల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. అమెరికాలో కేవలం ప్రీమియర్ బుకింగ్స్ బిజినెస్ 200K డాలర్లుగా నమోదైంది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్న ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురవడం ఖామని విశ్లేషకులు చెప్తున్నారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.