పాకిస్తాన్‌పై భారత్ అద్భుత విజయం

© ANI Photo

ఆసియా కప్ మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌పై జరిగిన ఉత్కంఠపోరులో భారత్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, ఆటకు దిగిన పాక్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కానీ ఛేదనలో ఇండియా ఆటగాళ్లు మొదట తడబడ్డారు. రాహుల్ రెండో బంతికే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ క్యాచ్ మిస్ కావడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత రోహిత్ 12, కోహ్లీ 35, సూర్యకుమార్ 18 రన్స్ చేసి వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో జడేజా అద్భుతమైన ఆటతీరుతో 29 బంతుల్లో 35 రన్స్ చేసి 19.1 ఓవర్లలో 141 రన్స్ వద్ద ఔటయ్యాడు. దీంతో భారత అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో 5 బంతుల్లో 7 రన్స్ రావాల్సి ఉండగా, పాండ్యా నాలుగో బంతికి సిక్స్ కొట్టి (17 బంతుల్లో 33) భారత జట్టును గెలిపించాడు. మరోవైపు భారత బౌలర్లు పాక్ జట్టుపై అదరగొట్టి భువనేశ్వర్ 4, హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ 2, అవేశ్ ఖాన్‌కు ఒక వికెట్లు తీశారు.

Exit mobile version