దేశంలో ఫిబ్రవరి నెలలో స్థూల GST ఆదాయం రూ.1,33,026 కోట్లకు చేరింది. వాటిలో CGST రూ.24,435 కోట్లు, SGST రూ.30,779 కోట్లు, IGST రూ.67,471 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 2022 నెల ఆదాయాలు గత సంవత్సరం ఇదే నెలలో GST రాబడుల కంటే 18% పెరిగినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 2020లో GST రాబడి కంటే ఇది 26% ఎక్కువగా ఉందని తెలిపారు. కాని జనవరిలో వసూలైన రూ.1,40,986 కోట్ల కంటే ఇవి తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉన్నందున జనవరిలో కంటే తక్కువ రాబడి వచ్చినట్లు చెబుతున్నారు.