2 వేల మందికిపైగా ప్రవాసీయులు అరెస్టు

© Envato

కువైట్ లో దాదాపు 2 వేల మందికిపైగా ప్రవాసీయులను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. అయితే వారిలో అనేక మంది గ్యాంబ్లింగ్, భిక్షాటన సహా పలు నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది ఆసియా, అరబ్ ప్రాంత వాసులున్నారని అధికారులు అంటున్నారు. చిన్న పిల్లలతో ఉండి భిక్షాటన చేస్తున్న వారిని ఆ దేశం నుంచి పంపించాలని పలుశాఖలకు ఆదేశించినట్లు సమాచారం. మరికొంత మంది రెసిడెన్సీ చట్టాలను అతిక్రమించినట్లు చెబుతున్నారు.

Exit mobile version