మార్చి 22న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కేరళ కొచ్చిలోని కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సిఎఫ్ఎస్) నుంచి 2,200 కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకుంది. కొచ్చిలోని విల్లింగ్డన్ ఐలాండ్‌లోని Q10 పేరుతో ఉన్న సీఎఫ్ఎస్లో ఇవి లభించాయి. చమురు రవాణా చేసే కంటైనర్‌లో ఈ దుంగలను చాకచక్యంగా దాచి ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కంటైనర్లను మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం కొచ్చి పోర్టు నుంచి రవాణా చేయాల్సి ఉంది. ఈ కంటైనర్ దుబాయ్ రవాణా కోసం బుక్ చేసినట్లు తెలుస్తుంది. దుబాయ్ నుంచి తిరిగి దక్షిణాసియా దేశాలకు తరలించేందుకు స్మగ్లర్లు ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చైనా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో ఎర్రచందనంకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొచ్చికి ఎర్రచందనం వచ్చినట్లు డీఆర్ఐ అనుమానం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇంటెలిజెన్స్ ఛేదించే పనిలో ఉంది.