దేశంలో గత 24 గంటల్లో 2,288 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసులు 19,637కి చేరుకున్నాయి. మరో 10 మంది కరోనా కారణంగా మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 52,4103కి చేరుకుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. మరోవైపు చైనాలో కరోనా విలయ తాండవం చేస్తుంది. చైనాలో మే 9న 3,475 కరోనా కేసులు నమోదయ్యాయి.