వాహన ప్రియులకు హమ్మర్ బ్రాండ్ వాహనాల గురించి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఏఎమ్ జనరల్ అనే ఓ ఆటోమొబైల్ సంస్థ అమెరికన్ సైనికులు కోసం ఈ వాహనాలను రూపొందించేది. అప్పట్లో వీటిని హమ్వీ అని పిలిచేవారు. వాటినే ఆధునికీకరించి హమ్మర్ గా రూపాంతరం చేశారు. కాలానుగుణంగా ఏమ్ జనరల్ నుంచి జనరల్ మోటార్స్ సంస్థ హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత ఈ సంస్థ హెచ్1, హెచ్2 మోడళ్లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే హమ్మర్ హెచ్1 ఎక్స్3 మోడళ్ లో భారీ వాహనాన్ని తయారు చేశారు. దీని ఎత్తు 22 అడుగులు. సాధారణ హమ్మర్ వాహనాల కంటే ఈ వాహనం మూడింతలు పెద్దగా ఉంటుంది. తాజాగా దీనిని యూఏఈ కి చెందిన ఓ కుబేరుడు సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ వాహనం ప్రత్యేకతలు పై వీడియోలో చూసేయండి.