దిల్లీలో ఫైవ్‌స్టార్ హోటల్‌కి ఓ వ్యక్తి కుచ్చుటోపి పెట్టాడు. యూఏఈ రాజవంశంలో కీలకవ్యక్తిగా పరిచయం చేసుకొని రూ. 23 లక్షల బిల్లు చెల్లించలేదు. మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి గతేడాది ఆగస్టులో లీలా ప్యాలెస్‌లో దిగాడు. నకిలీ బిజినెస్ కార్డు చూపించటంతో అందరూ నమ్మారు. రెండు నెలలకు రూ. 11 లక్షలు బిల్లు చెల్లించిన తర్వాత నవంబర్ 21న డ్రా చేసుకునేలా రూ. 22 లక్షల చెక్కు ఇచ్చాడట. నవంబర్ 20న వెండి వస్తువులు, ముత్యాలు పొదిగిన ట్రేతో ఉడాయించాడు. చెక్ బౌన్స్ కావటంతో అసలు విషయం తెలిసింది.