చిత్తూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. అపోలో ఫార్మసీ, చెన్నై సిల్క్స్ సంస్థల్లో పనిచేసేందుకు 19నుంచి 30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రూ.10వేల నుంచి రూ. 12వేల వరకు వేతనం అందుతుందని పేర్కొన్నారు. ఫార్మసీతో పాటు ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని..యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.